శనివారం 27 ఫిబ్రవరి 2021
International - Jan 24, 2021 , 15:26:59

శానిటైజ‌ర్ల‌తో జాగ్ర‌త్త‌.. పిల్ల‌ల క‌ళ్ల‌కు ప్ర‌మాదం

శానిటైజ‌ర్ల‌తో జాగ్ర‌త్త‌.. పిల్ల‌ల క‌ళ్ల‌కు ప్ర‌మాదం

క‌రోనా రాక‌ముందు శానిటైజర్ అన్న ప‌దమే చాలా మందికి తెలియ‌దు. కేవ‌లం డాక్ట‌ర్ల ద‌గ్గ‌ర మాత్ర‌మే క‌నిపించే ఈ శానిటైజ‌ర్‌.. ఇప్పుడు ప్ర‌తి ఇంటిలోనూ ద‌ర్శ‌న‌మిస్తోంది. డాక్ట‌ర్ల సూచ‌న‌లతో చేతులు శుభ్రంగా క‌డిగే ఓపిక లేనివాళ్లు లీట‌ర్ల‌కు లీట‌ర్ల శానిటైజ‌ర్లను చేతుల‌కు రుద్దేసుకుంటున్నారు. ఒక్క ఇల్ల‌నే కాదు.. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్‌, థియేట‌ర్లు ఎక్క‌డ చూసినా శానిటైజ‌ర్లు సాధార‌ణ‌మైపోయాయి. అయితే వీటితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తాజా అధ్య‌య‌నం ఒక‌టి తేల్చి చెబుతోంది. ముఖ్యంగా ఈ శానిటైజర్ల వ‌ల్ల‌ పిల్ల‌ల క‌ళ్లు దెబ్బ తింటున్న‌ట్లు ఈ అధ్య‌య‌నం గుర్తించింది. 

ఏడు రెట్లు పెరిగిన కేసులు

చేతుల‌కు శానిటైజ‌ర్ల‌ను వేసుకుంటున్న పిల్ల‌లు ఆ వెంట‌నే క‌ళ్లు తుడుచుకుంటుండ‌టం వ‌ల్ల అవి దెబ్బ‌తింటున్న‌ట్లు అధ్య‌య‌నం తేల్చింది. అంత‌కుముందు ఏడాదితో పోలి్తే 2020, ఏప్రిల్ 1 నుంచి ఆగ‌స్ట్ 24 మ‌ధ్య పిల్ల‌ల క‌ళ్లు దెబ్బ‌తిన్న కేసులు ఏకంగా ఏడు రెట్లు పెరిగిన‌ట్లు ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించిన ఫ్రెండ్ పాయిజ‌న్ కంట్రోల్ సెంట‌ర్ వెల్ల‌డించింది. శానిటైజ‌ర్ల‌లోని ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలు పిల్ల‌ల క‌ళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ద‌ని తెలిపింది. 2019 వ‌ర‌కు ర‌సాయనాల వ‌ల్ల క‌ళ్లు దెబ్బ‌తిన్న కేసుల్లో శానిటైజర్ల వాటా 1.3 శాతం కాగా.. 2020 చివ‌రినాటికి అది కాస్తా 9.9 శాతానికి చేరిన‌ట్లు ఈ అధ్య‌యనం తెలిపింది. 

VIDEOS

logo