బుధవారం 03 జూన్ 2020
International - Apr 03, 2020 , 13:42:24

స‌గం జ‌నాభా ఇంటికే ప‌రిమితం.. 90 దేశాల్లో లాక్‌డౌన్

స‌గం జ‌నాభా ఇంటికే ప‌రిమితం.. 90 దేశాల్లో లాక్‌డౌన్

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 390 కోట్ల మంది ప్ర‌జ‌లు ఇంటికి ప‌రిమితం అయ్యారు.  నోవెల్ క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ‌కుండా ఉండేందుకు చాలా వ‌ర‌కు దేశాలు స్టేట్ ఎట్ హౌమ్ ఆంక్ష‌ల‌ను విధించాయి. దీంతో ప్ర‌పంచంలో స‌గం జ‌నాభా ఇండ్ల‌కే హ‌త్తుకుపోయిన‌ట్లు తెలుస్తోంది.  ఏఎఫ్‌పీ వార్త సంస్థ ప్ర‌చురించిన డేటా ప్ర‌కారం ఈ విష‌యం వెల్ల‌డైంది. నిర్బంధం, క‌ర్ఫ్యూలు, క్వారెంటైన్ల లాంటి ఆంక్ష‌ల‌ను సుమారు 90 దేశాలు పాటిస్తున్న‌ట్లు ఆ స‌ర్వే పేర్కొన్న‌ది. శుక్ర‌వారం నుంచి థాయిలాండ్‌లో క‌ర్ఫ్యూ విధిస్తున్నారు.  దీంతో నిర్బంధ ప్ర‌జ‌ల సంఖ్య మ‌రింత పెర‌గ‌నున్న‌ది.  

ఇక స్పెయిన్‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య ప‌ది వేల‌కు చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో ఆ దేశంలో సుమారు 950 మంది మ‌ర‌ణించారు. ఇట‌లీలో కూడా వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10వేలు దాటింది.  సుమారు ల‌క్షా ప‌ది వేల మందికి వైర‌స్ సంక్ర‌మించింది. అయితే స్పెయిన్‌లో మాత్రం సంక్ర‌మ‌ణ రేటు త‌గ్గిన‌ట్లు ఆరోగ్య అధికారులు వెల్ల‌డించారు. స్సెయిన్‌లో వైర‌స్ నుంచి కోలుకుంటున్న‌వారి సంఖ్య కూడా పెరుగుతున్ని.  ఇట‌లీలో కూడా గ‌త వారంతో పోలిస్తే కొత్త ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గాయి.  స్పెయిన్‌లో నిరుద్యోగుల సంఖ్య అత్య‌ధికంగా మూడు ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ది. 

logo