గురువారం 28 మే 2020
International - Apr 25, 2020 , 11:54:28

హె‌యిర్ సెలూన్లు, బౌలింగ్ క్లబ్స్ రీఓపెన్

హె‌యిర్ సెలూన్లు, బౌలింగ్ క్లబ్స్ రీఓపెన్

జార్జియా: క‌రోనాను నియంత్రించేందుకు జార్జియాలో లాక్ డౌన్ అమ‌లు చేస్తుండ‌గా..హెయిర్ సెలూన్లు, స్పా సెంట‌ర్ల‌కుప్ర‌భుత్వం మిన‌హాయింపునిచ్చింది. రిప‌బ్లిక‌న్ గ‌వ‌ర్నర్ బ్రియాన్ కెంప్ జార్జియాలో సెలూన్‌, స్పా సెంట‌ర్, బౌలింగ్ క్ల‌బ్ ల‌ను తిరిగి నిర్వ‌హించుకునేందుకు ఆదేశాలు జారీచేశారు. దీంతో అట్లాంటా సిటీలోని త్రీ-13 సెలూన్ సెంట‌ర్ వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో క‌స్ట‌మ‌ర్లు బారులు తీరారు.

త‌మ సెలూన్ కు వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ల క‌నీసం 6 అడుగుల దూరంలో ఉండేలా సెలూన్ స్టాఫ్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అంతేకాకుండా సెలూన్‌లోకి వ‌చ్చే ముందు..క‌స్ట‌మ‌ర్ శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు ఎలా ఉన్నాయి..? వ‌చ్చిన వ్య‌క్తికి ద‌గ్గు ఏమైనా ఉందా..? ఈ మ‌ధ్య కాలంలో జ్వ‌రం ఏమైనా వ‌చ్చిందా..? వ్య‌క్తి ఇంట్లో ఎవ‌రైనా అనారోగ్యానికి గుర‌య్యారా..? గ‌త 14 రోజులుగా ఎవ‌రైనా క్వారంటైన్ లో ఉన్నారా..? అనే విష‌యాలు ఆరా తీస్తున్నారు. జార్జియాలో 21వేలకు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా..846 మంది మృతి చెందారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo