మంగళవారం 26 జనవరి 2021
International - Jan 06, 2021 , 10:25:14

ఆడ పాము కోసం మ‌గ పాముల కుస్తీ.. వీడియో

ఆడ పాము కోసం మ‌గ పాముల కుస్తీ.. వీడియో

శృంగారం.. ఆ ప‌దం విన‌గానే ఒళ్లంతా పుల‌కిస్తోంది.. అంత‌టి మాధుర్యం కోసం వేచి చూస్తుంటాం.. అలాంటి శృంగార చ‌ర్య కోసం రెండు మ‌గ పాములు కుస్తీ ప‌ట్టాయి. ఏ పాము అయితే అల‌సి పోకుండా ఫైట్‌లో నెగ్గుతుందో అది ఆడ పాముతో క‌ల‌యిక జ‌ర‌పొచ్చు. ఇలాంటి దృశ్యం కేవ‌లం ఆస్ర్టేలియాలోని ముల్గా పాముల్లోనే క‌నిపిస్తుంది. 

ఆస్ర్టేలియాలోని వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రంలో రెండు మగ పాములు ఆడ పాము కోసం సుమారు గంట పాటు పోట్లాడుకున్నాయి. త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన త‌ర్వాతే.. ఆడ పామును క‌లిసేందుకు వీలుంటుంది. గంట పాటు పాములు ఫైట్ చేయ‌డం ఇది రెండోసారి స్థానిక అధికారి తెలిపారు. వ‌సంత రుతువులో ఆడ పామును క‌లిసేందుకు మ‌గ పాముల వేట కొన‌సాగుతోంద‌ని చెప్పారు. పాముల క‌ల‌యిక‌కు ఇది స‌రైన స‌మ‌యం కాబ‌ట్టి పోటీ ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. 


logo