బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 20, 2020 , 18:36:18

లాహోర్‌లో హఫీజ్‌ సయీద్‌కు ఆంజియోప్లాస్టీ

లాహోర్‌లో హఫీజ్‌ సయీద్‌కు ఆంజియోప్లాస్టీ

లాహోర్‌: 2018-ముంబై దాడి కేసులో మాస్టర్‌మైండ్‌, జమాత్‌-ఉద్‌-దవా చీఫ్‌ హఫీజ్‌ సయీజ్‌కు లాహోర్‌లోని ఆస్పత్రిలో ఆంజియోప్లాస్టీ కొనసాగుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కోట్‌లాక్‌పత్‌ జైలులో హఫీజ్‌ సయీద్‌కు ఛాతిలో నొప్పి వచ్చింది. డాక్టర్లు పరీక్షించించారు. మళ్లీ నొప్పి రావడంతో ఆంజియోప్లాస్టీ కోసం పంజాబ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీకి తరలించి చికిత్సనందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న కేసులో 70 ఏళ్ల హఫీజ్‌ సయీద్‌కు  పాక్ కోర్టు 11 ఏళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోట్‌టాక్‌పత్‌ జైలులో శిక్షననుభవిస్తున్నాడు. 


logo