మంగళవారం 19 జనవరి 2021
International - Dec 05, 2020 , 01:56:24

సయీద్‌ అనుచరులు ముగ్గురికి జైలు

సయీద్‌ అనుచరులు ముగ్గురికి జైలు

  • 15 ఏండ్ల చొప్పున విధించిన ఏటీసీ

లాహోర్‌: ముంబై ఉగ్రదాడి సూత్రదారి, జమాత్‌-ఉద్‌-దవా (జేయూడీ) చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ అనుచరులు ముగ్గురికి పాక్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు (ఏటీసీ) 15 ఏండ్ల చొప్పున జైలు శిక్షను విధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు నమోదైన రెండు కేసుల్లో శుక్రవారం ఈ తీర్పునిచ్చింది. శిక్ష పడిన వారిలో అబ్దుల్‌ సలాం బిన్‌ ముహమ్మద్‌, జాఫర్‌ ఇక్బాల్‌, ముహమ్మద్‌ అశ్రఫ్‌ ఉన్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు నమోదైన ఓ కేసులో గురువారం కూడా సయీద్‌ ప్రతినిధి యహ్యా ముజాహిద్‌కు కోర్టు 15 ఏండ్ల జైలు శిక్ష విధించింది.