గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 12, 2020 , 16:13:04

హ‌ఫీజ్ స‌యీద్‌కు 5 ఏళ్ల జైలుశిక్ష‌

హ‌ఫీజ్ స‌యీద్‌కు 5 ఏళ్ల జైలుశిక్ష‌

హైద‌రాబాద్‌: జ‌మాతుల్ ద‌వా చీఫ్ హ‌ఫీజ్ స‌యీద్‌కు పాకిస్థాన్ కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష‌ను విధించింది.  ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఆర్థిక సాయం చేసిన కేసులో ఆయ‌న‌కు ఈ శిక్ష ఖ‌రారైంది. ముంబై దాడుల సూత్ర‌ధారి హ‌ఫీజ్‌పై రెండు టెర్ర‌ర్ ఫైనాన్సింగ్ కేసులు ఉన్నాయి.  గ‌త వారమే లాహోర్‌కు చెందిన యాంటీ టెర్ర‌రిజం కోర్టు విచార‌ణ‌ను పూర్తి చేసింది.  తీర్పును రిజ‌ర్వ్‌లో ఉంచిన జ‌డ్జి హ‌ర్ష‌ద్ హుస్సేన్ భుట్టా.. ఇవాళ హ‌ఫీజ్‌కు శిక్ష‌ను ఖ‌రారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అన్ని కేసుల‌ను ఒకే ద‌గ్గ‌ర‌కు చేర్చి.. తీర్పును ఇవ్వాలంటూ హ‌ఫీజ్ ఇటీవ‌ల ఏటీసీ కోర్టును కోరారు.  జైలు శిక్ష‌తో పాటు ప్ర‌తి కేసులోనూ 15వేల జ‌రిమానా చెల్లించాల‌ని కోర్టు తీర్పునిచ్చింది.  ఏటీఏ సెక్ష‌న్ 11-ఎఫ్‌(2), 11-ఎన్ కింద హ‌ఫీజ్‌ను దోషిగా తేల్చారు. 


logo