సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 02, 2020 , 10:56:25

డీఅడిక్షన్‌ సెంటర్‌పై కాల్పులు... 24 మంది మృతి

డీఅడిక్షన్‌ సెంటర్‌పై కాల్పులు... 24 మంది మృతి

మెక్సికో సిటీ: మెక్సికోలోని ఓ మాదకద్రవ్యాల బాధితుల పునరావాస (డ్రగ్స్‌ డీఅడిక్షన్‌) కేంద్రంపై దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో 24 మంది మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటో నగరంలో ఉన్న డ్రగ్స్‌ డీఅడిక్షన్‌ కేంద్రంలోకి చొరబడి దుండగులు కాల్పులు జరిపారని, 24 మంది మృతి చెందారని, ఏడుగు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పునరావాస కేంద్రంలోని ప్రతి ఒక్కరిపై కాల్పులు జరిపారని వెల్లడించారు. కాల్పుల ఘటన వెనక డ్రగ్స్‌ ముఠాల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇరపువాటలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. జూన్‌ 6న కూడా పునరావస కేంద్రంపై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడటంతో 10 మంది మరణించారు. గతంలో 2010లో చివావా నగరంలోని డ్రగ్స్‌ డీఅడిక్షన్‌ సెంటర్‌పై ఇదేవిధంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది మరణించారు.


logo