సోమవారం 01 జూన్ 2020
International - Apr 20, 2020 , 08:04:48

దుండగుడి కాల్పుల్లో 16 మంది మృతి

దుండగుడి కాల్పుల్లో 16 మంది మృతి

కేనడాలో ఆదివారం అర్ధరాత్రి ఓ దుండగుడు నెత్తుటేరులు పారించాడు. నోవాస్కాటియా గ్రామీణ ప్రాంతంలో గాబ్రియెల్‌ వార్ట్‌మాన్‌ అనే వ్యక్తి తుపాకీతో స్వైరవిహారం చేస్తూ కనిపించినవారినల్లా కాల్చేశాడు. అతన్ని పట్టుకొనేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించకపోవటంతో రెండు గంటలపాటు కష్టపడి అతన్ని కాల్చి చంపారు. పోర్టపిక్‌ అనే కమ్యూనిటీ ప్రాంతం మొత్తం కాల్పుల మోతలు, శవాలతో భీతావహంగా మారింది. శవాలు ఎక్కడపడితే అక్కడే పడి ఉన్నాయని మృతులు ఎంతమంది ఉంటారన్న విషయం కూడా చెప్పలేకపోతున్నామని పోలీసలు తెలిపారు. దుండగుడి కాల్పుల్లో రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ విభాగానికి చెందిన ఓ మహిళా అధికారి కూడా ఉందని వెల్లడించారు. వార్ట్‌మాన్‌ ఇంతటి దారుణానికి ఎందుకు తెగబడ్డారన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.  


logo