శనివారం 15 ఆగస్టు 2020
International - Mar 24, 2020 , 16:44:46

విమానాలకు పార్కింగ్ క‌ష్టాలు..

విమానాలకు పార్కింగ్ క‌ష్టాలు..

హైద‌రాబాద్‌: ఇది ఊహించ‌ని స‌మస్య‌.  ఎక్క‌డ చూసిన కోవిడ్‌19 ఆంక్ష‌లే. ఇక విమానాలు కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా ర‌ద్దు అయ్యాయి. చాలా వ‌ర‌కు దేశాలు ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాల‌కు బ్రేక్ వేశాయి.  ప్ర‌తి నిత్యం ఆకాశంలో దాదాపు 20 వేల విమానాలు గాలిలో ఎగురుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ విమానాలు ఎక్క‌డ ఆగాలో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది.  ట్రావెల్ బ్యాన్ విధించ‌డంతో.. చాలా వ‌ర‌కు ఎయిర్‌లైన్స్ త‌మ స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశాయి.  యురోపియ‌న్, అమెరిక‌న్ విమాన స‌ర్వీసులు పార్కింగ్ కోసం తెగ క‌ష్టాలు ప‌డుతున్నాయి. 

యూరోప్ దేశాల్లో విమానాల పార్కింగ్ చాలా ఖ‌రీదు అయిన‌ది. కొన్ని చోట్ల‌ గంట‌కు 300 డాల‌ర్ల వ‌ర‌కు కూడా చార్జ్ చేస్తారు. డెల్టా ఎయిర్‌లైన్స్ దాదాపు 600 విమానాల‌కు విశ్రాంతి క‌ల్పించింది.  ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఏయిర్‌వేస్ కూడా 150 విమానాల‌ను గ్రౌండ్ చేస్తున్న‌ది. పార్కింగ్ కోసం గ‌వ‌ర్న‌మెంట్‌, విమానాశ్ర‌యాల‌తో చ‌ర్చిస్తున్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. వైర‌స్ నియంత్ర‌ణ కోసం అనేక దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించాయ‌ని, దీంతో విమానాల పార్కింగ్ స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు ఆ సంస్థ సీఈవో తెలిపారు.

జ‌ర్మ‌నీకి చెందిన లుఫ్తాన్సా త‌న సీటింగ్ కెపాసిటీని త‌గ్గించింది. రానున్న నెల రోజుల్లో ఆ సంస్థ సుమారు 20 వేల ట్రిప్పుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌పంచ‌దేశాల‌కు చెందిన దాదాపు అన్ని విమానయాన సంస్థ‌లు త‌మ స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్నాయి. దీంతో విమానాల పార్కింగ్ ఓ స‌మ‌స్యగా మారిన‌ట్లు ఏవియేష‌న్ అధికారులు అంటున్నారు. 


logo