గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 02, 2020 , 15:52:57

పెళ్లి మధ్యలో వధువును వదిలేసి ఫ్రెండ్స్‌తో ముచ్చటపెట్టిన వరుడు! ‌

పెళ్లి మధ్యలో వధువును వదిలేసి ఫ్రెండ్స్‌తో ముచ్చటపెట్టిన వరుడు!  ‌

న్యూయార్క్‌: పెళ్లిదుస్తుల్లో వధువు, వరుడు వేదికపై తళుక్కుమంటున్నారు. పెళ్లితంతు మొదలైంది. వధువు చేతిలో వరుడు చేతి ఉంచి ‘అమ్మాయి నీకు ఓకేనా’ అని వివాహం జరిపించే పాస్టర్‌ అడగ్గానే వరుడు ఒక్క నిమిషం అని పక్కకు వెళ్లిపోయాడు. క్రికెట్‌లో టీం సభ్యులు ముచ్చటించుకున్నట్లుగా ఫ్రెండ్స్‌తో కలిసి చాట్‌ చేశాడు. ఇదంతా చూస్తున్న వధువు ఆశ్చర్యపోయింది. ఆందోళనతో వారినే తదేకంగా చూసింది. కాగా, కొద్దిసేపటికి వరుడు వధువు వద్దకు వచ్చి నాకిష్టమే అంటూ పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రాంక్‌ వీడియో రెడ్‌ఇట్‌లో పెట్టగా వైరల్‌ అయ్యింది. దీన్ని చూసి నెటిజన్లు నవ్వుకున్నారు. వధువు ఆందోళనపడడం నవ్వు తెప్పించింది. మంచి జోక్‌ అంటూ కొందరు కామెంట్‌ పెట్టారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండిlogo