శనివారం 06 జూన్ 2020
International - Apr 30, 2020 , 15:26:32

కరోనాపై పోరుకు లక్ష డాలర్లు విరాళం: గ్రెటా థంబర్గ్‌

కరోనాపై పోరుకు లక్ష డాలర్లు విరాళం: గ్రెటా థంబర్గ్‌

వాషింగ్టన్‌: స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థంబర్గ్‌ కరోనా పోరుకు లక్ష అమెరికన్‌ డాలర్లు (రూ.75,15,184) ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యునిసెఫ్‌) విరాళంగా ప్రకటించింది. డానిష్‌ ఫౌండేషన్‌ నుంచి గెలుపొందిన లక్ష డార్లను విరాళంగా అందిస్తున్నాని వెల్లడించింది. ‘పర్యావరణ సంక్షోభంలానే, కరోనా వైరస్‌ మహమ్మారి పిల్లల హక్కుల సంక్షోభం లాంటిదని అభిప్రాయపడింది. ఇది ప్రస్తుతం, దీర్ఘకాలికంగా చిన్నారులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. పిల్లల జీవితాలను కాపాడటానికి, చదువును కొనసాగించడానికి, ఆరోగ్యాన్ని రక్షించడానికి పనిచేస్తున్న యునిసెఫ్‌కు మద్దతు తెలపాలని 17 ఏండ్ల తంబర్గ్‌ కోరింది.  


logo