బుధవారం 03 జూన్ 2020
International - Mar 18, 2020 , 16:24:49

కిచెన్‌లో మాధురీ దీక్షిత్‌ పాటకు గ్రీక్‌ భామ స్టెప్పులు..వీడియో వైరల్‌

కిచెన్‌లో మాధురీ దీక్షిత్‌ పాటకు గ్రీక్‌ భామ స్టెప్పులు..వీడియో వైరల్‌

తేజాబ్‌ సినిమాలో ఏక్‌ దో తీన్‌ అంటూ అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌ స్టెప్పులేసిన పాట ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవిదేశాల్లో ఈ పాట అందరినీ  అలరించింది. ఇపుడు ఇదే పాటకు ఓ గ్రీక్‌ మహిళ డ్యాన్స్‌ చేసి అదరగొట్టింది. గ్రీక్‌కు చెందిన కేథరినా కొరోసిడో మాధురీ దీక్షీత్‌కు వీరాభిమాని. కేథరినా కిచెన్‌లో ఏక్‌ దో తీన్‌ పాటను ప్లే చేసి స్టెప్పులేసిన వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 


logo