శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 01, 2020 , 09:23:19

రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఇవే గ‌డ్డు ప‌రిస్థితులు : ఐక్య‌రాజ్య‌స‌మితి

రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఇవే గ‌డ్డు ప‌రిస్థితులు : ఐక్య‌రాజ్య‌స‌మితి

హైద‌రాబాద్‌: క‌రోనా మ‌హ‌మ్మారి.. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఎదురైన అతిపెద్ద స‌వాల్ అని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియా గుటెర్ర‌స్ అన్నారు. నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్ప‌డ‌నున్న‌ట్లు ఆయ‌న అంచ‌నా వేశారు. ఆ మాంద్యం ఎంత‌లా ఉంటుందంటే, ఇటీవ‌ల కాలంలో అలాంటి మాంద్యం ఎప్పుడూ ఏర్ప‌డ‌లేద‌న్నారు. మ‌హ‌మ్మారి వ‌ల్ల సామాజిక ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ఎలా ప్ర‌భావితం అవుతాయ‌న్న యూఎన్ నివేదిక‌ను ఆయ‌న రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా గుటెర్ర‌స్ మాట్లాడుతూ.. క‌రోనాను మ‌రింత దూకుడుగా ఎదుర్కోవాల‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా  క‌రోనా కేసులు 8.50 ల‌క్ష‌లు దాటింది. సుమారు 42వేల మంది మ‌ర‌ణించారు. మ‌ర‌ణాల సంఖ్య‌లో చైనాను అమెరికా దాటేసింది.

కోవిడ్‌19 వ్యాధి వ‌ల్ల ఆర్థిక వ్య‌వస్థ దెబ్బ‌తింటుంద‌ని, దీని వ‌ల్ల అస్థిర‌త ఏర్ప‌డుతుంద‌ని, అశాంతి వ్యాపిస్తుంద‌ని, ఘ‌ర్ష‌ణ‌లు పెరుగుతాయ‌ని యూఎన్ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. 75 ఏళ్ల ఐక్య‌రాజ్య‌స‌మితి చ‌రిత్ర‌లో ఇంత పెద్ద గ్లోబ‌ల్ హెల్త్ సంక్షోభాన్ని ఎదుర్కోలేద‌న్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను తీస్తున్న‌ద‌ని, వ్యాధితో బాధ‌ప‌డేవారి సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచ‌న‌ల మేర‌కు ప్ర‌పంచ దేశాలు స్పందించాల‌న్నారు.  డ‌బ్ల్యూహెచ్‌వో సూత్రాల‌ను చాలా వ‌ర‌కు దేశాలు గౌర‌వించ‌డం లేద‌న్నారు. logo