ఆదివారం 23 ఫిబ్రవరి 2020
వీర జవాన్లకు ఘన నివాళులు..

వీర జవాన్లకు ఘన నివాళులు..

Feb 14, 2020 , 23:28:46
PRINT
వీర జవాన్లకు ఘన నివాళులు..

 హైదరాబాద్‌: గతేడాది ఉగ్రదాడిలో అసువులు బాసిన భారత వీర జవాన్లకు దేశ, విదేశాల్లోనూ నివాళులు అర్పిస్తున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని యావత్‌భారతీయులతో సహా ప్రవాస భారతీయులు కొవ్వుత్తులతో, పుష్పగుచ్చాలతో జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఖతార్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ విభాగం.. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లను స్మరించుకుంటూ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. వారి చిత్రపటాల ముందు కొవ్వొత్తులు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అమర సైనికుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ.. రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఖతార్‌ విభాగం అధ్యక్షుడు శ్రీధర్‌ అబ్బగౌని మాట్లాడుతూ.. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు వందనాలన్నారు. మన కోసం, మనదేశం అహర్నిశలు శ్రమిస్తూ, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా దేశాన్ని రక్షిస్తున్న క్రమంలో సైనికులు మరణించడం భాదాకరమన్నారు. దేశం కోసం పోరాడుతున్న ప్రతి సైనికుడిని గౌరవించాలని, వారిని దైవ సమానంగా భావించాలని ఆయన అన్నారు. ఈ సంస్మరణ సభలో టీఆర్‌ఎస్‌ ఖతార్‌ విభాగం ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికెని, మహేందర్‌ చింతకుంట, ఎల్లయ్య తాళ్లపల్లి, ప్రేమ్‌కుమార్‌, శంకరాచారి, శోభన్‌, అరుణ్‌, కిరణ్‌, గడ్డి రాజు, సంపత్‌, రాజేష్‌, రమేష్‌, సుభాన్‌, సంజు తదితరులు పాల్గొన్నారు. 


logo