శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 18, 2020 , 16:03:38

లండన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

లండన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంతో పాటు విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ యూకే ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ 66వ బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షులు అశోక్‌ గౌడ్‌ దూసరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా నిర్మించే క్రమంలో భగవంతుడు సీఎంకు అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్నిచ్చి, తన ఆశీస్సులతో ముందుకు నడిపించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాక్షులు నవీన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కన్న కలల్ని సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారన్నారు. అందుకనుగుణంగా ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారని నవీన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌, మాజీ ఎంపీ కవిత, యావత్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు.. ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ను అత్యంత ప్రోత్సహిస్తున్నారనీ,వారికి ఈ సందర్భంగా కృతజతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రతి తెలంగాణ బిడ్డ కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరచడం చారిత్రక అవసరమని ఆయన అన్నారు. అడ్వైజరీ బోర్డు వైస్‌ చైర్మన్‌ సిక్కా చంద్రశేఖర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. నేడు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో తెలంగాణ ప్రత్యేకతను సంతరించుకుందని అన్నారు. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న అపర భగీరథుడికి కృతజతలు తెలిపారు. గొప్ప గొప్ప పథకాలు చేపడుతూ.. రాష్ర్టాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం, ఎన్నారై టీఆర్‌ఎస్‌ ఐటీ కార్యదర్శి వినయ్‌ ఆకుల మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకెళ్తోందని అన్నారు.

అనంతరం  వారు సీఎం కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ పుట్టినరోజున వారు రక్తదానం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కొరకు సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారనీ.. వారందరి ఆశీస్సులతో ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే బృందం లండన్‌లోనే గాక, రాష్ట్రంలోను ప్రతి సంవత్సరం సీఎం పుట్టినరోజున పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నారై అధికార ప్రతినిధి రాజ్‌కుమార్‌ శానబోయిన నాయకత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈవెంట్‌ ఇంచార్జి సత్య చిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్‌ గోపతి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణలో నిమగ్నమైన సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమాన్నారు.

కార్యక్రమంలో అధ్యక్షులు అశోక్‌ గౌడ్‌ దూసరి, ఉపాధ్యక్షులు నవీన్‌ రెడ్డి, అడ్వైజరీ బోర్డు వైస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌, కార్యదర్శులు హరిబాబు, సత్యమూర్తి చిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్‌ గోపతి, అధికార ప్రతినిధులు రవి పులుసు, రవి రేతినేని, ఐటీ సెక్రటరీ వినయ్‌ ఆకుల, సభ్యులు..  ఆరూరి విశాల్‌, దూసరి సాయికుమార్‌ గౌడ్‌, జవహర్‌ లాల్‌ రమావత్‌, కాసుల భరత్‌, వేణు వివేక్‌ చెరుకు, టిల్లీస్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డి, ప్రణీత్‌, క్రాంతి, రాజశేఖర్‌, అబ్దుల్లా, ప్రణయ్‌, తరుణ్‌ రెడ్డి, సోహైల్‌, కమల్‌, మనోహర్‌ మిట్ట, సయూద్‌ పాల్గొన్నారు. 


logo