ఇంటి ఆవరణలో రెండో ప్రపంచయుద్ధంనాటి టన్నెల్!

లండన్: వారు 40 ఏళ్లుగా ఆ ఇంట్లో ఉంటున్నారు.. కానీ ఆ ఇంటి ఆవరణలో ఓ టన్నెల్ (ఏయిర్ రైడ్ షెల్టర్) ఉన్న విషయం తెలియదు. మ్యాన్‌హోల్ మూత ఉన్న విషయం తెలుసుకానీ.. దానికింద ఏముందో తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. అయితే, లాక్డౌన్ టైంలో ఖాళీగా ఉండడంతో ఓరోజు మ్యాన్‌హోల్ పైకప్పు తెరిచి చూశారు. లోపల టన్నెల్ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. దానికి మెరుగులద్ది బార్గా మార్చేశారు.
ఈ ఆసక్తికర సంఘటన బ్రిటన్‌లోని వోల్వర్‌హాంప్టన్‌లో జరిగింది. భారతీయ సంతతికి చెందిన 68 ఏళ్ల ఖండుపటేల్ ఇంటి ఆవరణలో ఈ టన్నెల్ బయటపడింది. ఖండుపటేల్ పాఠశాల సంరక్షకుడిగా పనిచేస్తున్నాడు. 1920 లలో నిర్మించిన ఇంటిని అతడు 40 ఏళ్ల క్రితం కొనుగోలుచేశాడు. గత యజమాని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తన తోటలో ఏయిర్ రైడ్ షెల్టర్‌ను ఏర్పాడు చేశాడు. ఈవిషయం పటేల్కుగానీ.. వారి కుటుంబ సభ్యులకుగానీ తెలియదు. లాక్డౌన్ సమయంలో పటేల్ తన స్నేహితుడితోకలిసి మ్యాన్‌హోల్ క్యాప్‌ను ఎత్తగా టన్నెల్ బయటపడింది. మెట్లు కనిపించడంతో లోపలికి తవ్వుకుంటూ వెళ్లారు. పది అడుగుల లోతుకు తవ్వగా టన్నెల్ కనిపించింది. దానికి రంగులు వేసి కొన్ని టేబుల్స్, లైట్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడది బార్గా మారిపోయింది. ఇందులో 40 మంది కూర్చోవచ్చని పటేల్ చెబుతున్నాడు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపేందుకు మంచి చోటు దొరికిందని సంతోషం వ్యక్తంచేస్తున్నాడు. కాగా, ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సముద్రంలో పడవ.. చెలరేగిన మంటలు
- షిరిడీకి వెళ్దామని చెప్పి.. స్వామీజీ కిడ్నాప్
- చైనా ఉపసంహరిస్తేనే.. మన దళాలను తగ్గిస్తాం : రాజ్‌నాథ్
- నెటిజన్స్ ట్రోల్ చేయడంతో పోస్ట్ డిలీట్ చేసిన సమంత
- నిలకడగా శశికళ ఆరోగ్యం
- ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- ఆచార్యలో చరణ్ సరసన ఈ బ్యూటీని ఫైనల్ చేశారా..!
- నేటి నుంచి తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో