మంగళవారం 09 మార్చి 2021
International - Jan 06, 2021 , 10:02:07

క‌రోనా ఎఫెక్ట్‌.. గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం వాయిదా

క‌రోనా ఎఫెక్ట్‌.. గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం వాయిదా

న్యూయార్క్‌: క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 31న‌ జ‌ర‌గాల్సిన గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌వాన్ని వాయిదా వేసిన‌ట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్ల‌డించింది. మార్చి 14న ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు గ్రామీ నిర్వాహ‌కులు తెలిపారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ అవార్డుల‌ను బ‌హూక‌రిస్తారు. అయితే ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితులు ద‌య‌నీయంగా ఉన్నాయి. భారీ సంఖ్య‌లో క‌రోనా కేసుల‌తో ఆసుపత్రులు కిట‌కిట‌లాడుతున్నాయి. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింద‌ని గ్రామీ నిర్వాహ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. 

VIDEOS

logo