గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 21, 2020 , 20:22:47

నేపాల్‌లో ముగియనున్న లాక్‌డౌన్

నేపాల్‌లో ముగియనున్న లాక్‌డౌన్

కఠ్మాండు: నేపాల్‌లో త్వరలో లాక్‌డౌన్ ముగియనున్నది. కరోనా నేపథ్యంలో మార్చి 24న విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఆగస్టు 17తో ముగుస్తుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ యుబా రాజ్ ఖతివాడ మంగళవారం తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 17 నుంచి స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకుంటాయని చెప్పారు. అయితే భారీ వేడుకలు, పార్టీలను అనుమతించబోమన్నారు.

ఆగస్టు 17 నుంచి అంతర్జాతీయ సరిహద్దులను తెరుస్తామని, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా పునరుద్ధరిస్తామని యుబా తెలిపారు. అదే రోజు నుంచి పర్యాటకులను అనుమతిస్తామని, విదేశాల్లో చిక్కుకున్న తమ దేశీయుల తరలింపు కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. నేపాల్‌లో కరోనా కేసుల సంఖ్య 18 వేలు దాటగా 40 మంది మరణించారు.

తాజావార్తలు


logo