శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Jul 18, 2020 , 17:35:32

ట్విట్టర్‌కు నోటీసులు పంపిన భారత ప్రభుత్వం

ట్విట్టర్‌కు నోటీసులు పంపిన భారత ప్రభుత్వం

న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ట్విట్టర్‌పై సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హ్యాక్‌కు గురైన ఖాతాలో భారతీయులు ఎవరెవరు ఉన్నారో తెలపాలని భారత సైబర్‌ సెక్యూరిటీ నోడల్ ఏజెన్సీ సీఈఆర్టీ-ఇన్ ట్విట్టర్‌కు నోటీసు జారీ చేసింది. దీనిపై వీలైనంత త్వరలో తమకు సమాధానం చెప్పాలని శనివారం జారీచేసిన నోటీసులో పేర్కొంది. హ్యాక్‌ గురించి, రికి కలిగిన నష్టం, ఆ అకౌంట్ల గురించి భారతీయ వినియోగదారులకు సమాచారం ఇచ్చారా లేదా అనేది కూడా తెలియజేయాలని ట్విట్టర్‌‌ను కోరింది. హ్యాకింగ్‌ తగ్గించేందుకు ట్విట్టర్‌‌ తీసుకున్న చర్యల గురించి కూడా చెప్పాలని కోరింది.

కాగా హ్యకర్లు 130 ఖాతాలను లక్ష్యంగా చేసుకోగా విషయం తెలుసుకున్న ట్విటర్‌ వాటిలో  45 ఖాతాలను రీసెట్ చేసింది. మిగిలిన వాటిలో పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది.  జూలై 15 న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సెలబ్రెటీలు, బిజినెస్‌ మ్యాన్‌ల ట్విట్టర్‌‌ ఖాతాలు ఇటీవల హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్, మీడియా మొఘల్‌ మైక్‌ బ్లూమ్‌బర్గ్, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్, మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తోపాటు యాపిల్, ఉబర్‌ వంటి సంస్థల అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయి.   


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo