శనివారం 30 మే 2020
International - Apr 19, 2020 , 10:36:10

ఎఫ్‌డీఐలో స‌వ‌ర‌ణ‌.. ఆటోమెటిక్ టేకోవ‌ర్ కుద‌ర‌దు

ఎఫ్‌డీఐలో స‌వ‌ర‌ణ‌.. ఆటోమెటిక్ టేకోవ‌ర్ కుద‌ర‌దు

హైద‌రాబాద్‌: విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల విధానాన్ని భార‌త ప్ర‌భుత్వం స‌వ‌రించింది.  కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ దీనికి సంబంధించి కొత్త విధానాన్ని ప్ర‌క‌టించింది.  భార‌త భూభాగంతో స‌రిహ‌ద్దు ఉన్న దేశాలు ఏవైనా.. ఎఫ్‌డీఐ పెట్టుబడులు పెట్టాల‌నుకుంటే, అది ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కార‌మే ఉండాల‌ని పేర్కొన్న‌ది. ఈ కొత్త విధానంతో చైనాకు భార‌త్ చెక్ పెట్టింది.  కోవిడ్‌19 సంక్షోభ స‌మ‌యంలో.. ఎవ‌రైనా ఒక సంస్థ‌ను ఎఫ్‌డీఐ ద్వారా టేకోవర్ చేసుకోవాలంటే, అది అవ‌కాశవాదంగా ఉండ‌కూడ‌దు అని, పెట్టుబ‌డి పెట్టాల‌నుకునేవారు ముందుగా ప్ర‌భుత్వాన్ని ఆశ్ర‌యించాల‌ని వాణిజ్య మంత్రిత్వ‌శాఖ పేర్కొన్న‌ది.  ఆటోమెటిక్ ప‌ద్ధ‌తిలో టేకోవ‌ర్ చెల్ల‌దు అని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. గ‌తంలో ఈ కొత్త నియ‌మం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల‌కు వ‌ర్తించేది. ఇప్పుడు ఆ జాబితాలో చైనా కూడా చేరింది.


logo