ఆదివారం 05 జూలై 2020
International - Jun 13, 2020 , 15:45:15

ఉగాండాలో‌ ప్ర‌ఖ్యాత గొరిల్లా హ‌త్య‌

ఉగాండాలో‌ ప్ర‌ఖ్యాత గొరిల్లా హ‌త్య‌

న్యూఢిల్లీ: ఉగాండాలో ప్రపంచ ప్రఖ్యాత‌ గొరిల్లా ర‌ఫికి హ‌త్య‌కు గురైంది. న‌లుగురు వేటగాళ్లు క‌లిసి గొరిల్లాను హ‌త్య చేశారు. ఉగాండాలోని బ్విండి ఇంపినిట్రేబుల్‌ నేషనల్‌ పార్కులో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రఫికి అనే ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్‌ బ్యాక్‌ గొరిల్లా ఉగాండాలోని బ్విండి ఇంపినిట్రేబుల్‌ నేషనల్ పార్కులో ఉండేది. ఆ 25 ఏండ్ల‌ మగ గొరిల్లా ప్రమాదంలో పడిన‌ కొండజాతి గొరిల్లాలకు నాయకుడుగా ఉండేది.

అయితే, కొద్దిరోజుల క్రితం నలుగురు వేటగాళ్లు గొరిల్లా రఫికిని చంపేసినట్లు ఉగాండా వైల్డ్‌లైఫ్‌ అథారిటీ అధికారులు ప్రకటించారు. గొరిల్లా హ‌త్య‌కు పాల్పడిన‌ నలుగురిలో ఒక‌రిని ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, ఆత్మరక్షణ కోసమే గొరిల్లాను చంపేశామ‌ని పోలీసుల అదుపులో ఉన్న వేట‌గాడు బయామికామా ఫెలిక్స్‌ అనే వేటగాడు అంగీకరించాడు. రఫికిని చంపిన కేసులో ఆ నలుగురు వేటగాళ్లకు జీవితఖైదు పడుతుంద‌ని ఉగాండా పోలీసులు తెలిపారు.


logo