గురువారం 21 జనవరి 2021
International - Dec 14, 2020 , 21:47:58

గూగుల్‌ ప్రాజెక్ట్‌ లూన్ రికార్డు..!

గూగుల్‌ ప్రాజెక్ట్‌ లూన్ రికార్డు..!

కాలిఫోర్నియా: ప్రపంచంలోని చాలచోట్ల మారుమూల ప్రాంతాలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేదు. అయితే, ఈ సమస్యకు ప్రఖ్యాత సంస్థ గూగుల్‌ పరిష్కారం చూపింది. ఇందుకోసం ‘గూగుల్‌ ప్రాజెక్ట్‌ లూన్‌’ను అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. హీలియం బెలూన్ల ద్వారా రిమోటెడ్‌ ఏరియాలకు ఇంటర్‌నెట్‌ అందేలా ఏర్పాట్లు చేసింది. ఈ హీలియం బెలూన్లు స్ట్రాటో ఆవరణలో వదులుతారు. ఇవి ఏరియల్ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ను సృష్టిస్తాయి.

గూగుల్‌ గతేడాది ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. హీలియం బెలూన్లు ఒక మిలియన్‌ గంటలు ప్రయాణించి స్ట్రాటో ఆవరణలోకి చేరుకున్నట్లు ప్రకటించింది. అలాగే, స్ట్రాటో ఆవరణలో 312 రోజులు ఉండి సరికొత్త రికార్డును సృష్టించినట్లు గూగుల్‌ వెల్లడించింది. అంటే దాదాపు ఒక ఏడాది. ఇది సుమారు 1,35,000 మైళ్ళు (సుమారు 2.1 లక్ష కిలోమీటర్లు) దూరం అన్నమాట. అలాగే, లూన్‌ ఎగ్జిక్యూటివ్‌ నేచర్‌ జర్నల్‌లో ఈ హీలియం బెలూన్‌లు ఏడాదిపాటు ఎలా ఉండగలిగాయో వివరించారు. ఇవి గాలిప్రవాహాలు, మెషీన్‌ లర్నింగ్‌తో మారుతూ ఉంటాయని తెలిపారు. బెలూన్లు అనుకూలమైన గాలి ప్రవాహాన్ని పట్టుకునేందుకు ఎత్తులో పైకి లేదా కిందికి నావిగేట్ చేస్తాయని, అది వాటిని కావలసిన దిశకు తీసుకువెళ్తుందని వివరించారు. ఈ బెలూన్లు ఎప్పుడు పైకి వెళ్తాయి.. లేదా కిందికి దిగుతాయి అనేది మాన్యువల్‌ కాదని, అంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారానే ఆపరేట్‌ చేస్తామని పేర్కొన్నారు. అంటే వాటి నావిగేషన్‌ సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా పనిచేస్తుందని తెలిపారు. అలాగే, వీటిలో ఉపయోగించిన అధునాతన టెక్నాలజీ ద్వారా బెలూన్లు గ్రౌండ్ స్టేషన్‌కు సులభంగా సంకేతాలను పంపగలవు, స్వీకరించగలవని పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo