గురువారం 28 మే 2020
International - May 07, 2020 , 10:05:58

జ‌ర్న‌లిస్టుల‌కు గూగుల్ ఉచిత వృత్తి నైపుణ్య శిక్ష‌ణ‌

జ‌ర్న‌లిస్టుల‌కు గూగుల్ ఉచిత వృత్తి నైపుణ్య శిక్ష‌ణ‌

శాన్‌ఫ్రాన్సిస్కో: జ‌ర్న‌లిస్టుల‌కు గూగుల్ ఉచిత వృత్తి నైపుణ్య శిక్ష‌ణ అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జ‌ర్న‌లిస్టులు ఈ సౌక‌ర్యాన్ని వినియోగించుకోవ‌చ్చు. కోవిడ్ -19 కార‌ణంగా ప‌త్రికా రంగం, మీడియాపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. దానికి త‌ట్టుకోవ‌డానికి వాటి నిర్వ‌హ‌కులు ఖ‌ర్చును త‌గ్గించుకోవాల‌నుకుంటున్నారు. అందుకే జ‌ర్న‌లిస్టుల‌కు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, మెష‌న్ ల‌ర్నింగ్‌ల‌పై ఉచిత శిక్ష‌ణ కోర్సు అందించ‌నున్నాట్లు గూగుల్ ప్ర‌తినిధులు తెలిపారు.

 ప్ర‌పంచంలోని 17 భాష‌ల‌లో ఈ కోర్సుల‌ను అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. వార్తా సంస్థ‌లు ఏఐ(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) వాడ‌కంపై గ‌త సంవ‌త్స‌రం నిర్వ‌హించిన స‌ర్వేలో వృత్తి నైపుణ్య శిక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని తేలింది. కొత్త శిక్ష‌ణా కోర్సును ఏఐ వీటీఆర్ న్యూస్‌, గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ స‌హాకారంతో అందిస్తుంది. లాగిన్ అవ్వ‌డం ద్వారా శిక్ష‌ణ‌లో పురోగ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు. శిక్ష‌ణ పూర్త‌యిన త‌రువాత స‌ర్టిఫికెట్ కూడా ఇస్తారు. 


logo