బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 10, 2020 , 12:18:05

కరోనా ఎఫెక్ట్‌.. ఉద్యోగార్థులకు గూగుల్‌ ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు..!

కరోనా ఎఫెక్ట్‌.. ఉద్యోగార్థులకు గూగుల్‌ ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు..!

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ సంస్థలు ఇప్పటికే తమ తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంను అందిస్తున్న విషయం విదితమే. చాలా కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా సాఫ్ట్‌వేర్‌ సంస్థ గూగుల్‌ ఇకపై ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థులకు తమ క్యాంపస్‌లలో ఫేస్‌ టు ఫేస్‌ కాకుండా ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా ఇంటర్వ్యూలు చేయనుంది. ఈ మేరకు గూగుల్‌ ఒక ప్రకటనను విడుదల చేసింది. 

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌లలో ఉన్న గూగుల్‌ కార్యాలయాలకు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులు ఇకపై ఆయా క్యాంపస్‌లకు వెళ్లాల్సిన పనిలేదని, తామే వారికి ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని గూగుల్‌ వెల్లడించింది. అలాగే ఆయా క్యాంపస్‌లను చూసేందుకు వచ్చే సందర్శకులను కూడా ఇకపై క్యాంపస్‌లలోకి అనుమతించబోమని గూగుల్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 


logo
>>>>>>