మంగళవారం 26 జనవరి 2021
International - Dec 14, 2020 , 17:58:06

గూగుల్ స‌ర్వ‌ర్లు డౌన్‌.. ప‌ని చేయ‌ని యూట్యూబ్‌, జీమెయిల్‌

గూగుల్ స‌ర్వ‌ర్లు డౌన్‌.. ప‌ని చేయ‌ని యూట్యూబ్‌, జీమెయిల్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా గూగుల్ స‌ర్వ‌ర్లు డౌన్ అయ్యాయి. దీంతో గూగుల్ సంబంధిత యూట్యూబ్‌, జీమెయిల్‌, మీట్‌తోపాటు ప‌లు ఇత‌ర యాప్స్‌, సేవ‌లు ప‌ని చేయ‌డం లేదు. ఈ విష‌యాన్ని ప‌లువురు యూజ‌ర్లు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. అలాగే వెబ్‌సైట్‌, స‌ర్వ‌ర్ డౌన్ ట్రాక‌ర్ వెబ్‌సైట్ అయిన డౌన్ డిటెక్ట‌ర్ కూడా గూగుల్ సర్వ‌ర్లు డౌన్ అయ్యాయ‌ని చెప్పింది.

సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి సేవ‌లు నిలిచిపోయిన‌ట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై గూగుల్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ప‌లువురు యూజ‌ర్లు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌పై యూట్యూబ్‌ను ఓపెన్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. స‌ర్వర్‌కు క‌నెక్ట్ కాలేక‌పోతున్నామ‌న్న మెసేజ్ వ‌స్తోంది. అయితే ప‌లువురి డెస్క్‌టాప్‌ల‌పై మాత్రం ఇవి ఓపెన్ అవుతున్నాయి. మేజ‌ర్ యాప్స్ విష‌యంలో ఇలాంటి స‌ర్వీస్ డౌన్‌లు సాధార‌ణ‌మే. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి. షెడ్యూల్డ్ మెయింట‌నెన్స్‌, చిన్న చిన్న బ‌గ్స్‌లాంటివి ఈ స‌మ‌స్య‌ల‌కు కార‌ణంగా చెప్పొచ్చు.


logo