బుధవారం 03 జూన్ 2020
International - Apr 14, 2020 , 18:04:18

కరోనా కాలంలో గూగుల్‌లో ఎక్కువ‌గా వెతికింది వీటినే..

కరోనా కాలంలో గూగుల్‌లో ఎక్కువ‌గా వెతికింది వీటినే..

క్వారెంటైన్‌లో అంద‌రూ ఇంట్లోనే.. బ‌య‌ట‌కు వెళ్లి చేసేదేమి లేక అర‌చేతిలోనే ప్ర‌పంచాన్ని చూస్తున్నారు. కొవిడ్‌-19 గురించి మ‌రే ఇత‌ర విష‌యాల‌పై ఎలాంటి సందేహాలు వ‌చ్చినా గూగుల్‌నే సంప్ర‌దిస్తారు నెటిజ‌న్లు.  లాక్ డౌన్ సమయంలో భారతీయులు అత్యధికంగా వెతికిన 30 అంశాలను గూగుల్ ప్రకటించింది. అవేంటో చూద్దాం. 


టాప్ సెర్చ్ లన్నీ కరోనాకు సంబంధించినవే

- క‌రోనా వైర‌స్ టిప్స్ – ఈ అంశంపై 1 కోటి మందికి పైగా గూగుల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సెర్చ్ చేశారు.

- క‌రోనా వైర‌స్ – ఈ ప‌దంపై 50 ల‌క్ష‌ల సెర్చ్‌లు గూగుల్‌కు వ‌చ్చాయి.

- లాక్‌డౌన్ ఎక్స్‌టెన్ష‌న్ – దీని గురించి 10 ల‌క్ష‌ల‌కు పైగా సెర్చ్‌లు వ‌చ్చాయి.

- కోవిడ్ – 19 – 7 ల‌క్ష‌ల సార్లు ఈ ప‌దం గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు.

- హైడ్రాక్సీ క్లోరోక్విన్ – 6 ల‌క్ష‌ల‌కు పైగా దీని గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు.

- క‌రోనా వైర‌స్ సింప్ట‌మ్స్ – 5 ల‌క్ష‌ల సెర్చ్‌లు వ‌చ్చాయి.

- ఆరోగ్య సేతు యాప్ – 3.2 ల‌క్ష‌ల సెర్చ్‌లు గూగుల్‌కు వ‌చ్చాయి.

- లాక్‌డౌన్ – 2 ల‌క్ష‌ల‌కు పైగా సెర్చ్‌లు వ‌చ్చాయి.

- ఆరోగ్య సేతు – 2 ల‌క్ష‌ల సెర్చ్‌లు

- క‌రోనా వైర‌స్ ప్రివెన్ష‌న్ – 2 ల‌క్ష‌ల‌కు పైగా సెర్చ్‌లు

- ఇండియా కోవిడ్ 19 ట్రాక‌ర్ – 1.2 ల‌క్ష‌ల‌కు పైగా సెర్చ్‌లు

- ఆరోగ్య సేతు యాప్స్ డౌన్‌లోడ్ – 1 ల‌క్ష‌కు పైగా సెర్చ్‌లు

- లాక్ డౌన్ ఇన్ ఇండియా – 1 ల‌క్ష‌కు పైగా సెర్చ్‌లు వ‌చ్చాయి.

- బీసీజీ వ్యాక్సిన్ – 1.2 ల‌క్ష‌ల‌కు పైగా సెర్చ్‌లు వ‌చ్చాయి.

- లాక్‌డౌన్ ఇండియా – 1 ల‌క్ష‌కు పైగా సెర్చ్‌లు

- క‌రోనా అప్‌డేట్ ఇన్ ఇండియా – 1 ల‌క్ష‌కు పైగా సెర్చ్‌లు

- కోవిడ్ 19 ట్రాక‌ర్ – 50వేల‌కు పైగా సెర్చ్‌లు

- లేటెస్ట్ క‌రోనా వైర‌స్ న్యూస్ – 30వేల‌కు పైగా సెర్చ్‌లు

- క‌రోనా వైర‌స్ ట్రీట్‌మెంట్ – 20వేల‌కు పైగా సెర్చ్‌లు

- లాక్‌డౌన్ న్యూస్ – 1 ల‌క్ష‌కు పైగా సెర్చ్‌లు

- కోవిడ్ 19 ఇండియా – 20వేల‌కు పైగా సెర్చ్‌లు వ‌చ్చాయి.

- పీపీఈ కిట్ – 50వేల‌కు పైగా సెర్చ్‌లు

- హెచ్‌సీక్యూ – 20వేల వ‌ర‌కు సెర్చ్‌లు

- ఐవ‌ర్‌మెక్టిన్ – 50వేల సెర్చ్‌లు

- లాక్‌డౌన్ న్యూస్ టుడే – 50వేల‌కు పైగా సెర్చ్‌లు

- లాక్‌డౌన్ ఎక్స్‌టెండెడ్ – 20వేల‌కు పైగా సెర్చ్‌లు

- హాట్‌స్పాట్ – 10వేల సెర్చ్‌లు

- లాక్‌డౌన్ ఇన్ ఢిల్లీ – 10వేల‌కు పైగా సెర్చ్‌లు

- లాక్‌డౌన్ లేటెస్ట్ న్యూస్ – 20వేల‌కు పైగా సెర్చ్‌లు

- ఇండియా లాక్‌డౌన్ ఎక్స్‌టెన్షన్ – 10వేల‌కు పైగా సెర్చ్‌లు గూగుల్‌కు వ‌చ్చాయి.


logo