ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 30, 2020 , 17:33:48

29 యాప్స్ తొలగించిన గూగుల్

29 యాప్స్ తొలగించిన గూగుల్

న్యూఢిల్లీ : ఒకవైపు దేశంలో చైనా వ్యతిరేక భావాలు తీవ్రతరం కాగా.. చైనాకు పాఠం నేర్పడానికి వారికి చెందిన 59 యాప్స్ తోపాటు మరో 47 యాప్‌లను కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జాతీయ భద్రత కారణంగా పలు యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించింది. మరోవైపు గూగుల్ తన వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని 29 యాప్ లను తొలగించింది. తీసివేయబడిన అనువర్తనాలు యాడ్వేర్ అని క్లెయిమ్ చేయబడ్డాయి. ఈ యాప్ లను తమ దర్యాప్తులో భాగంగా వైట్ ఆప్స్ సాటోరి థ్రెట్ ఇంటెలిజెన్స్ కనుగొంది. తొలగించిన యాప్ లల్లో ఎక్కువగా ఫొటో ఎడిటింగ్ యాప్ లే ఉన్నాయి.

ఈ యాప్ లన్నీ అనవసరంగా ప్రకటనలను అమలు చేస్తున్నాయి. వీటిని గుర్తించలేకపోయాము. ఒకసారి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా వినియోగదారులు ఈ యాప్ లను తీసివేయలేకపోయారు. ఎందుకంటే డౌన్‌లోడ్ చేసిన తర్వాత వారి ఐకాన్‌లు ఫోన్ నుంచి అదృశ్యమయ్యాయి. అయితే, యాప్ లు మాత్రం మొబైల్‌లోనే ఉన్నాయి. వైట్ యాప్స్ సాటోరి బృందం ఈ యాప్ లల్లో ఒకటి స్క్వేర్ ఫొటో బ్లర్ యాప్.. ఖాళీ షెల్ లాగా పనిచేస్తుందని గుర్తించారు. మన మొబైల్ నుంచి ఈ యాప్ లను తొలగించిన తర్వాత కూడా అవి పనిచేస్తూనే ఉండటాన్ని గుర్తించారు. దాంతో వినియోగదారుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని గూగుల్ భావించి 29 యాప్లను తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. తొలగించిన యాప్ లలో కొన్ని 5 లక్షలకు పైగా డౌన్ లోడ్లను అందుకున్నాయి. వీటిని తొలగించడంతో కోట్లలో వినియోగదారులు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి.

తొలగించిన యాప్స్..

ఆటో పిక్చర్ కట్, కలర్ కాల్ ఫ్లాష్, స్క్వేర్ ఫొటో బ్లర్, స్క్వేర్ బ్లర్ ఫోటో, మ్యాజిక్ కాల్ ఫ్లాష్, ఈజీ బ్లర్, ఇమేజ్ బ్లర్, ఆటో ఫోటో బ్లర్, ఫొటో బ్లర్, ఫొటో బ్లర్ మాస్టర్, సూపర్ కాల్ స్క్రీన్, స్క్వేర్ బ్లర్, స్క్వేర్ బ్లర్ మాస్టర్, స్మార్ట్ బ్లర్ ఫోటో, స్మార్ట్ ఫొటో బ్లర్, సూపర్ కాల్ ఫ్లాష్, స్మార్ట్ కాల్ ఫ్లాష్, బ్లర్ ఫొటో ఎడిటర్, బ్లర్ ఇమేజ్.


logo