ఆదివారం 05 జూలై 2020
International - Jun 30, 2020 , 21:25:02

‘గూగుల్‌ ఫొటోస్‌’లో ఆటో బ్యాకప్‌ అవుట్‌!

‘గూగుల్‌ ఫొటోస్‌’లో ఆటో బ్యాకప్‌ అవుట్‌!

కాలిఫోర్నియా: టెక్‌ కంపెనీ గూగుల్‌ ఆటో బ్యాకప్‌ ఆప్షన్‌కు స్వస్తి పలికింది. వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్ లాంటి చాట్‌ యాప్స్‌లో గూగుల్ ఫొటోలకు ఇకపై మీడియాను బ్యాకప్ చేయబోమని ప్రకటించింది. దీన్ని ఈ నెల ప్రారంభంలో పరీక్షంచిన ఆ కంపెనీ, ఇప్పుడు దీన్ని అన్ని గూగుల్‌ ఫొటోస్‌ వినియోగదారులకు వర్తింజేస్తున్నది. ఇందుకోసం గూగుల్‌ ఫోటోస్‌లో డీఫాల్ట్‌ సెట్టింగ్స్‌ను మార్చింది. 

ఇంతకుముందు మొబైల్‌లో సేవ్‌ చేసిన ఫొటోలు, వీడియోలు గూగుల్‌ ఫొటోస్‌లో ఆటో సేవ్‌ అయ్యేవి. అలాగే, ఫోన్‌ కెమెరాతో తీసిన, ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన, వివిధ మెసేజింగ్‌, సోషల్‌ మీడియా యాప్‌లనుంచి తీసుకున్న చిత్రాలు కూడా బ్యాకప్‌ అయ్యేవి. ఇవి ఆటోమేటిక్‌గా సేవ్ కాకుండా ఉండాలంటే మ్యాన్‌వల్‌గా ఆఫ్‌ చేసుకోవాల్సి ఉండేది. అయితే, ఇంటర్నెట్‌ వనరులను కాపాడేందకు కొత్త నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.  దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. కాగా, యాప్‌లకు సంబంధించిన పూర్తి జాబితాను ఆ కంపెనీ ప్రకటించలేదు. కానీ ప్రస్తుతం వాట్సాప్‌, మెసేజెస్‌, కిక్‌, స్నాప్‌చాట్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, లైన్‌కు ఆటోబ్యాక్‌ అప్‌ ఆప్షన్ తీసేస్తున్నట్లు తెలిపింది.ఇప్పటికే గూగుల్ ఫొటోలకు బ్యాకప్ చేయబడిన వినియోగదారుల ప్రస్తుత చాట్ మీడియా ఈ మార్పు వల్ల ఏ విధంగానూ ప్రభావితం కాదని పేర్కొంది.  వారు చాట్ మీడియా అంతా బ్యాకప్ అవుతూనే ఉందని నిర్ధారించుకునేందుకు గూగుల్‌ ఫొటోస్‌లోని ఫీచర్‌ను మాన్యువల్‌గా ఆన్‌ చేసుకోవచ్చని తెలిపింది.logo