శుక్రవారం 10 జూలై 2020
International - Jun 20, 2020 , 15:16:40

ఉత్తరార్థగోళంలో ఎండాకాలంపై గూగుల్‌ డూడుల్‌!

ఉత్తరార్థగోళంలో ఎండాకాలంపై గూగుల్‌ డూడుల్‌!

న్యూ ఢిల్లీ: ఉత్తరార్థగోళంలో ఎండాకాలం ప్రారంభమైనట్లు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగూల్‌ ఈ రోజు డూడుల్‌గా పెట్టింది. ఎండలో ఓ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో పెంగ్విన్‌ పక్షి ఉన్న చిత్రాన్ని ఇందుకు ఎంచుకున్నది. ఇక్కడ ఎండాకాలం జూన్‌లో ప్రారంభమై ఆగస్టుతో ముగుస్తుంది. దక్షిణార్థ గోళంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది.

  ఇదిలా ఉండగా, జూన్‌ 21ను ‘సమ్మర్‌ సాల్టైస్‌’ అంటారు. అంటే సూర్యుడు ఆకాశంలో ఎక్కువసేపు నిలిచి ఉండే రోజని అర్థం. దీంతో ఉత్తరార్థగోళంలో పగలు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఈ రోజు సూర్యకాంతిని ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తారు. ఆర్కిటిక్‌ సర్కిల్‌లో రోజంతా సూర్యకాంతి ఉంటుంది. కాగా, దక్షిణార్థ గోళంలో ఈ రోజు పగలు తక్కువగా ఉంటుంది. దీన్ని వింటర్‌ సాల్టైస్‌ అంటారు. అంటే ఇక్కడ వర్షాకాలం ప్రారంభమవుతుంది. 

logo