గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 09, 2020 , 18:17:31

పబ్లిక్ వై-ఫై కోసం స‌రికొత్త ప్లాట్‌ఫాం‌ను ప్రారంభించిన గూగుల్‌

పబ్లిక్ వై-ఫై కోసం స‌రికొత్త ప్లాట్‌ఫాం‌ను ప్రారంభించిన గూగుల్‌

శాన్ ఫ్రాన్సిస్కో : బహిరంగ ప్రదేశాల్లో వినియోగదారుల కోసం సురక్షితమైన, వేగవంతమైన రోమింగ్‌కై గూగుల్.. ఓరియ‌న్ అనే అధిక-నాణ్యత గ‌ల ‌స‌రికొత్త వైఫై ప్లాట్‌ఫాంను విడుద‌ల చేసింది. ఓరియన్ వైఫై అనేది ప్రయోగాత్మక ప్రాజెక్టుల కోసం గూగుల్ ఇంటి ఇంక్యుబేటర్ 120 నుంచి వ‌చ్చిన సరికొత్త వేదిక. సంస్థ నివేదిక ప్ర‌కారం..  ఓరియన్ వైఫై ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్‌లకు ఎక్కువ మంది సందర్శకులను కనెక్ట్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ  వైఫై చాలా వాణిజ్య సంస్థల సిస్టమ్‌లతో పనిచేస్తుంది. 

"కిరాణా దుకాణం, వైద్య కార్యాలయం, మాల్ వంటి బహిరంగ వేదికల కోసం సెల్యులార్ క్యారియర్‌లకు వై-ఫై సామర్థ్యాన్ని విక్రయించడానికి మేము సులభమైన మార్గాన్ని రూపొందించాం" అని ఏరియా 120 డైరెక్టర్ రాజ్ గజ్వానీ మంగళవారం ఒక పోస్ట్‌లో తెలిపారు. "ఓరియన్ వైఫైతో మీరు కిరాణా దుకాణంలోకి అడుగుపెట్టినప్పుడు, మీ క్యారియర్ మిమ్మల్ని స్వయంచాలకంగా, సురక్షితంగా వైఫైకు కనెక్ట్ చేయగలదు" అని గజ్వానీ చెప్పారు. ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించిన మొదటి సెల్యులార్ క్యారియర్‌లలో గూగుల్ ఫై, రిపబ్లిక్ వైర్‌లెస్ ఉన్నాయి. 

"సిరియన్ సిస్టమ్స్, కామ్‌స్కోప్ (రుకస్), జునిపెర్ మిస్ట్ వంటి ప్రముఖ వై-ఫై తయారీదారులతో ఓరియన్ వైఫై అనుకూలంగా ఉందని, వారి నెట్‌వర్కింగ్ పరికరాలతో సులభంగా అమర్చగలదని నిర్ధారించడానికి మేము వారితో  భాగస్వామ్యం అవుతున్నాం" అని కంపెనీ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo