ఆదివారం 29 మార్చి 2020
International - Mar 08, 2020 , 15:20:23

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌.. గూగుల్‌ ఐ/ఓ 2020 రద్దు..

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌.. గూగుల్‌ ఐ/ఓ 2020 రద్దు..

కాలిఫోర్నియా: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ గూగుల్‌ మే 12 నుంచి 14వ తేదీ వరకు జరగాల్సిన వార్షిక డెవలపర్‌ సదస్సు ఐ/ఓ 2020ని రద్దు చేసింది. ఈ మేరకు గూగుల్‌ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్‌ కారణంగానే ఈ సదస్సును రద్దు చేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. డెవలపర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ సారి కష్టతరమవుతుంది, కానీ సదస్సు కన్నా వారి ఆరోగ్యం ముఖ్యమని తాము భావిస్తున్నామని గూగుల్‌ తెలిపింది. అయితే సదస్సు రద్దు నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను గూగుల్‌ అన్వేషిస్తున్నది. ఈ క్రమంలో ఈ విషయంపై త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. 


logo