గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 29, 2020 , 18:46:03

గూగుల్‌ ఉద్యోగికి కరోనా

గూగుల్‌ ఉద్యోగికి కరోనా

జ్యురిచ్‌:  అమెరికా టెక్‌ దిగ్గజం గూగుల్‌కు చెందిన ఓ ఉద్యోగికి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) సోకింది. స్విట్జర్లాండ్‌  జ్యురిచ్‌లోని గూగుల్‌ ఉద్యోగికి కరోనా  లక్షణాలు కనిపించడంతో   తాజాగా పరీక్షలు నిర్వహించగా  ఆ ఉద్యోగికి పాజిటివ్‌గా తేలింది. జ్యురిచ్‌ ఆఫీస్‌లో  చాలా తక్కువ సమయం గడిపిన ఓ ఉద్యోగికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని గూగుల్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.  కంపెనీలో పనిచేస్తున్న  ప్రతి ఉద్యోగి ఆరోగ్యం, భద్రతకు తాము మొదటి ప్రాధాన్యం ఇస్తామని   వెల్లడించింది. ఐతే కార్యాలయాన్ని మూసివేసే ఆలోచన లేదని..ఆలాగే తమ ఉద్యోగులను క్వారంటైన్‌లో ఉంచే అవకాశం కూడా లేదని పేర్కొంది.

మిగతా ఆఫీసుల మాదిరిగానే జ్యురిచ్‌ కార్యాలయం ఓపెన్‌ చేసే ఉంటుందని ప్రతినిధి స్పష్టం చేశారు. తమ దేశంలో ఇప్పటి వరకు  15  కేసులను గుర్తించామని, వందలాది మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు   స్విస్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్‌, ఇటలీ, చైనా దేశాలకు ప్రయాణించొద్దని ఉద్యోగులకు గూగుల్‌ సూచించింది.  కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 


logo