సోమవారం 26 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 16:35:49

ఇండియన్‌ స్విమ్మర్‌కు గూగుల్‌ అరుదైన గౌరవం..ఏం చేసిందంటే..?

ఇండియన్‌ స్విమ్మర్‌కు గూగుల్‌ అరుదైన గౌరవం..ఏం చేసిందంటే..?

న్యూఢిల్లీ: ఇండియన్‌ స్విమ్మర్‌ ఆరతి సాహాకు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ అరుదైన గౌరవం ఇచ్చింది. ఇంగ్లిష్‌ చానల్‌ ఈదిన మొదటి ఆసియా మహిళ అయిన ఆరతి 80వ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ రోజు ఆమె చిత్రాన్ని డూడుల్‌గా పెట్టింది. ఈ డూడుల్‌ కోల్‌కతాకు చెందిన లావణ్యనాయుడు అనే కళాకారిణి ఆలోచనలోంచి రూపుదిద్దుకున్నది.

పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించిన ఆరతి.. హూగ్లీ నదిలో ఈత నేర్చుకుంది. ఐదేళ్ల వయస్సులోనే  ఆమె మొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె గురువు సచిన్ నాగ్.. 1948 ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 100 మీటర్ల ఫ్రీస్టైల్‌తోపాటు వాటర్ పోలోలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆరతి 11 ఏళ్ల వయస్సులో యువ స్విమ్మింగ్ ప్రాడిజీగా మారింది. ఆమె 1952 సమ్మర్ ఒలింపిక్స్‌కు వెళ్లే భారతీయ బృందంలో భాగమైంది. జట్టులో నలుగురు మహిళలు మాత్రమే ఉన్నారు. ఆమె వారిలో ఒకరు. 18 ఏళ్ల వయసులో ఇంగ్లిష్‌ చానల్‌లో ఈత కొట్టిన మొదటి ఆసియా మహిళగా అవతరించడంతో ఆమెకు మరింత గుర్తింపు లభించింది. సాహాకు 1960 లో పద్మశ్రీ కూడా లభించింది. ఈ గౌరవం పొందిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo