ఆదివారం 24 జనవరి 2021
International - Dec 20, 2020 , 16:17:12

చలికి వణుకుతున్న వ్యక్తికి ప్యాంట్‌ ఇప్పి ఇచ్చేశాడు..!

చలికి వణుకుతున్న వ్యక్తికి ప్యాంట్‌ ఇప్పి ఇచ్చేశాడు..!

న్యూయార్క్‌: చలికాలం రోడ్డుపక్కన చాలామందికి బట్టలులేక వణికిపోతుంటారు. నిరాశ్రయులను ఆదరించే వారే కరువు. ముఖ్యంగా కార్లలో తిరిగేవారికి ఇవేమీ కనిపించవు అనుకుంటాం. కానీ అమెరికాలో ఓ వ్యక్తి రోడ్డుపక్కన చలికి వణికిపోతున్న వ్యక్తిని గమనించి కారు దిగి అతడి వద్దకు వెళ్లాడు. తన ప్యాంటు తీసి అతడికి ఇచ్చేశాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది ఈ సంఘటన. ఫ్రెస్నోలోని డోనట్‌ దుకాణానికి  డేనియల్ రిచర్డ్స్ అతడి భార్యతో కలిసి వచ్చాడు. అక్కడే డేవిడ్ అనే నిరాశ్రయుడిని గమనించారు. వెంటనే డేనియల్‌ కారు దిగి వెళ్లి అతడికి కొంత ఆహారం ఇచ్చాడు. ఒంటిపై కేవలం షార్ట్‌ మాత్రమే ఉందని గ్రహించిన డేనియల్‌.. తన ఒంటిమీదున్న ప్యాంటును విప్పి డేవిడ్‌కు ఇచ్చేశాడు. దీంతో ఆనందం పట్టలేక డేవిడ్‌.. డేనియల్‌ను హగ్‌ చేసుకున్నాడు. ఆ ఉల్లాసకరమైన సందర్భాన్ని కారులో ఉన్న డేనియల్‌ భార్య కెమెరాలో బంధించారు. ఇప్పుడు ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లుకొడుతోంది. ఇప్పటివరకూ మిలియన్ల మంది వీక్షించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo