సోమవారం 01 జూన్ 2020
International - Apr 25, 2020 , 21:12:12

తొలి ద‌శ ట్ర‌య‌ల్స్‌లో గుడ్ రిజ‌ల్ట్స్‌

తొలి ద‌శ ట్ర‌య‌ల్స్‌లో గుడ్ రిజ‌ల్ట్స్‌

ప్రపంచదేశాలు క‌రోనాతో విల‌విల్లాడుతున్నాయి. ఇప్ప‌టికే 205దేశాల‌కు పైగా క‌రోనా విస్త‌రించింది. 26ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదు కాగా మ‌ర‌ణాలు 2ల‌క్ష‌ల‌కు చేరు‌వ‌య్యాయి. ఈ క్ర‌మంలో చైనా కరోనా వైరస్ ను ఖ‌తం చేసేందుకు వ్యాక్సిన్ త‌యారీలో త‌ల‌మున‌క‌లై ఉన్న‌ది. ఇప్ప‌టికే  తాజాగా చైనా మూడో వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ కు అనుమతిచ్చింది. వ్యాక్సిన్ ను చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్) నేతృత్వంలో వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో లాజికల్ ప్రాడక్స్ , వూహాన్ వైరాలజీ ల్యాబ్(డబ్ల్యూఐవి), చైనా సైన్యానికి చెందిన రెండు సైంటిస్ట్ కేంద్రాల్లో వ్యాక్సిన్లతో క్లీనికల్ ట్రయల్స్ చేపట్టాయని పేర్కొంది. ఈ ట్ర‌య‌ల్స్ మంచి ఫ‌లితాన్ని ఇస్తుంద‌ని తెలిపింది. తొలిదశ క్లీనికల్ ట్రయల్స్ లో 96మందికి ప్రయోగించినట్లు..వారి ఆరోగ్యం బాగునట్లు చెప్పింది. ఇక మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ పూర్తయిన తరువాత వాటి పనితీరు తెలుసుకునేందుకు  సంవత్సరం పడుతుందని చెప్పారు.


logo