బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 13, 2020 , 16:28:08

గుడ్ న్యూస్ ఫ్రం న్యూయార్క్

గుడ్ న్యూస్ ఫ్రం న్యూయార్క్

న్యూయార్క్ : న్యూయార్క్‌లో నాలుగు నెలల్లో తొలిసారిగా శనివారం కరోనా నుంచి మరణించిన కేసులేవీ లేవు. కరోనా వ్యాప్తి మార్చి ప్రారంభంలో అమెరికా చేరుకుంది. శనివారం మొదటిసారి ఎలాంటి మరణాలు నమోదుకాలేదు. ఆదివారం ఎన్‌వైసీ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. మార్చి 13 తర్వాత తొలిసారి శనివారం నాడు కరోనాకు సంబంధించి ఎటువంటి మరణాలు సంభవించలేదు. తాజా డేటా ప్రకారం, న్యూయార్క్‌లో 215,924 మందికి కరోనా సోకగా.. 18,670 మంది మరణించారు. యునైటెడ్ స్టేట్స్ లో కరోనా సోకిన వారి సంఖ్య 33 లక్షలు దాటింది. మరణాల సంఖ్య కూడా 1.35 లక్షలకు చేరుకుంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 135,205 కు పెరిగింది. ప్రస్తుతం, కరోనా ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండవ, భారత్ మూడవ స్థానంలో ఉన్నాయి. 7.26 లక్షల కేసులతో రష్యా నాలుగో స్థానంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 5.69 లక్షల మంది మరణం

ప్రపంచంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య నిరంతరం పెరుగుతున్నది. ప్రస్తుతం, 200 కంటే ఎక్కువ దేశాలు ఈ ఘోరమైన వైరస్ బారిన పడ్డాయి. వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 12,910,357 మందిలో కరోనా నిర్ధారించగా.. 569,128 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,116,957 మంది కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు.


logo