ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 14, 2020 , 13:54:59

గోల్ఫ్‌కోర్టులో మొసలి.. ఎంత దర్జాగా నడుచుకుంటూ వెళ్తోందో..!వీడియో

గోల్ఫ్‌కోర్టులో మొసలి.. ఎంత దర్జాగా నడుచుకుంటూ వెళ్తోందో..!వీడియో

ఫ్లోరిడా: అది డైనోసరా? మనం జురాసిక్‌ పార్క్‌లో ఉన్నామా..? ఈ వీడియో చూస్తే మొదట మనకు అలాగే అనిపిస్తుంది. ఓ మొసలి గోల్ఫ్‌కోర్టులో దర్జాగా నడుచుకుంటూ వెళ్తోంది. తుఫాన్‌ సమయంలో మొసలి పచ్చనిగడ్డిపై నడుస్తుండగా ఈ వీడియో షూట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌ అవుతోంది. ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్టులో ఈ మొసలి కనిపించింది. నేపుల్స్‌లోని వాలెన్సియా గోల్ఫ్ అండ్‌ కంట్రీ క్లబ్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో క్లిప్‌ను వాలెన్సియా గోల్ఫ్ అండ్‌ కంట్రీ క్లబ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది.  ఇప్పటివరకూ ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.