శనివారం 04 జూలై 2020
International - Jul 01, 2020 , 01:37:31

13 మర్డర్లు.. పదుల సంఖ్యలో రేప్‌లు

13 మర్డర్లు.. పదుల సంఖ్యలో రేప్‌లు

  • నేరాలు అంగీకరించిన ‘గోల్డెన్‌ స్టేట్‌ కిల్లర్‌'

శాక్రమెంటో: వరుస దోపిడీలు, లైంగికదాడులు, హత్యలతో కాలిఫోర్నియా ప్రజలను హడలెత్తించిన ‘గోల్డెన్‌ స్టేట్‌ కిల్లర్‌', మాజీ పోలీస్‌ అధికారి జోసెఫ్‌ జేమ్స్‌ డీ ఏంజెలో జూనియర్‌ (74) సోమవారం కోర్టు ముందు తన నేరాలను అంగీకరించాడు. దశాబ్దాలపాటు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరిగిన అతడు ఎట్టకేలకు 2018లో పట్టుబడ్డాడు. అప్పటి నుంచి అతడు కోర్టు విచారణల్లో దాదాపు మౌనంగానే ఉంటున్నాడు. అయితే మరణశిక్షను జీవితఖైదుగా (పెరోల్‌కు అనుమతి లేకుండా) మార్చేందుకు అనుమతించే అగ్రిమెంట్‌లో భాగంగా అతడు సోమవారం కోర్టు ముందు నోరువిప్పాడు. నేరాలను తానే చేసినట్లు అంగీకరించాడు. విచారణలో అతడు అధికారులకు సహకరించలేదు. అయితే తనలో ఫెర్రీ అనే మరో వ్యక్తి ఉన్నాడని, అతడే ఈ నేరాలకు తనను పురిగొల్పాడని గొణిగేవాడు. అదంతా అవాస్తమని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. సోమవారం జరిగిన విచారణలో తాను 13 దారుణ హత్యలు, పదుల సంఖ్యలో లైంగికదాడులకు పాల్పడినట్లు అతడు అంగీకరించినట్లు ప్రాసిక్యూటర్‌  తెలిపారు. 1970లలో మొదలైన డీ ఏంజెలో నేరాల పరంపర 1986 వరకు కొనసాగింది. ఘటనా స్థలాల్లో దొరికిన డీఎన్‌ఏ ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకున్నారు.


logo