గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 21:43:39

గోల్డెన్‌ లాబ్రడార్‌ జాతి కుక్కకు 13 పిల్లలు..అన్నీ నలుపే..!

గోల్డెన్‌ లాబ్రడార్‌ జాతి కుక్కకు 13 పిల్లలు..అన్నీ నలుపే..!

హైదరాబాద్‌: అది గోల్డెన్‌ లాబ్రడార్‌ జాతి కుక్క. దానికి మూడేళ్లు. ఇటీవల  గర్భం దాల్చింది. తాజాగా ప్రసవించింది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఏకంగా 13 పిల్లలకు జన్మనిచ్చింది. అవన్నీ కూడా నలుపురంగులోనే ఉండడం విశేషం. మొదటిసారి ఓ కుక్కను పెంచుకుంటున్న యజమానురాలు ఇన్ని కుక్కలకు తాను ఓనర్‌నయ్యానంటూ ఆశ్చర్యంతోపాటు ఆందోళన కూడా చెందిందట.

తమ పెంపుడు కుక్క లూసీ ఒకదానివెంట ఒక కుక్కపిల్లకు జన్మనిస్తుంటే ఆశ్చర్యపోయానని యజమాని కేథరీన్‌ స్మిత్‌ పేర్కొంది. తాను కుక్కను పెంచుకోవడం ఇదే మొదటిసారని తెలిపింది. ఐదు లేదా ఆరు కుక్కపిల్లలకు జన్మనిస్తుందని అనుకున్నానని, ఏకంగా 13 కుక్కపిల్లలను చూసేసరికి ఆశ్చర్యం కలిగిందన్నారు. లూసీ 20 నిమిషాల్లో నాలుగు కుక్కపిల్లలకు జన్మనిచ్చిందని, కానీ చివరి నాలుగు గంటల వరకు చూస్తే మొత్తం 13 కుక్క పిల్లలున్నాయని తెలిపింది. ఇవన్నీ కూడా బ్లాక్‌ లాబ్రడార్‌ జాతికి చెందినవేనంది. లూసీ మాత్రం గోల్డెన్‌ లాబ్రడార్‌ అని తెలిపింది.


logo