మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 13, 2020 , 15:53:51

శునకానికి బంగారు విగ్రహం.. ఆవిష్కరించిన దేశాధ్యక్షుడు!ఎక్కడంటే..?

శునకానికి బంగారు విగ్రహం.. ఆవిష్కరించిన దేశాధ్యక్షుడు!ఎక్కడంటే..?

తుర్క్మెనిస్తాన్‌: ‘ప్రతికుక్కకూ ఓ రోజొస్తుంది..’ అనే సామెత ఇక్కడ నిజమైంది. తుర్క్మెనిస్తాన్‌లో ఓ కుక్కకు బంగారు విగ్రహం చేయించారు. దాన్ని ఆ దేశ రాజధాని నగరం అష్గాబాట్‌లో ప్రముఖ ట్రాఫిక్‌ సర్కిల్‌ వద్ద ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు ఆవిష్కరించారు.

ఈ కుక్క సాధారణంగా మధ్య ఆసియాలో ఉన్న దేశాల్లో స్థానికంగా లభించే 'అలబాయ్' జాతి. దీనిని మధ్య ఆసియా గొర్రెల కాపరి అని కూడా పిలుస్తారు. మరి దీన్ని ఎందుకు అక్కడ ప్రతిష్టించారో తెలుసా? ఇది తుర్క్మెనిస్తాన్‌  అధ్యక్షుడు గుర్బాంగూలీ బెర్డిముఖమడోవ్‌కు ఇష్టమైన జాతి. ఈ విగ్రహావిష్కరణ వీడియోను ట్విట్టర్‌లో పెట్టగా, వైరల్‌ అవుతోంది.   

మరిన్ని అప్‌డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.