మంగళవారం 02 మార్చి 2021
International - Jan 25, 2021 , 15:03:44

బంగారు గ‌ని కూలిన ఘ‌ట‌న‌లో 10 మంది మృతి

బంగారు గ‌ని కూలిన ఘ‌ట‌న‌లో 10 మంది మృతి

బీజింగ్‌:  చైనాలో బంగారు గ‌ని కూలిన ఘ‌ట‌న‌లో 10 మంది మృతిచెందిన‌ట్లు ఎమ‌ర్జెన్సీ టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో 11 మందిని ర‌క్షించారు.  జ‌న‌వ‌రి 10వ తేదీన షాన్‌డాంగ్ ప్రావిన్సులో ఉన్న బంగారు గ‌ని కూలింది.  ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆ గ‌నిలో 22 మంది మైన‌ర్లు ఉన్నారు.  శిథిలాల కింద ఉన్న వారిని ర‌క్షించేందుకు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఇంకా ఒక‌రి ఆచూకీ చిక్క‌డం లేద‌ని రెస్క్యూ అధికారులు పేర్కొన్నారు. గని కూలిన 10 రోజుల త‌ర్వాత‌.. 12 మంది మాత్రమే స‌జీవంగా ఉన్నట్లు సంకేతాలు పంపిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ఆహారం, మందులు పంపించాలంటూ బ్ర‌తికి ఉన్న 12 మంది కార్మికులు సందేశం పంపారు.  

గ‌నిలో జ‌రిగిన భారీ పేలుడు వ‌ల్ల ఎగ్జిట్ ద్వారం ధ్వంస‌మైంది.  ఆ గ‌నిలో ఉన్న క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ కూడా డ్యామేజ్ అయ్యింది. ఓ చిన్న రంధ్రం ద్వారా ఆహారాన్ని, మందుల‌ను, పెప‌ర్, పెన్సిళ్ల‌ను పంపారు.  పెయిన్ కిల్ల‌ర్స్ కావాలంటూ బ్ర‌తికి ఉన్న కార్మికులు ఓ లేఖ ద్వారా తెలిపారు. గ‌ని ఎంట్రెన్స్ నుంచి సుమారు 600 మీట‌ర్ల లోతులో కార్మికులు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది.  గ‌ని కూలిన ఘ‌ట‌న కూడా ఓ రోజు ఆల‌స్యంగా తెలిసింది. దీంతో రెస్క్యూ ప‌నుల్లో జాప్యం జ‌రిగింది. సంఘ‌ట‌న‌ను రిపోర్ట్ చేయ‌డంలో ఆల‌స్యం జ‌ర‌గ‌డం వ‌ల్ల స్థానిక అధికారుల‌ను ప్ర‌భుత్వం తొల‌గించింది. చైనాలో గ‌త ఏడాది సంభ‌వించిన ప‌లు గ‌ని కూలిన ఘ‌ట‌న‌ల్లో  అనేక మంది మ‌ర‌ణించారు. 

VIDEOS

logo