వాషింగ్టన్, జూన్ 21: శరీరంలో కొవిడ్ యాంటిబాడీల స్థాయిలను సొంతంగా పరిశీలించుకోవడంలో సహాయపడే సులభమైన గ్లూకోజ్ మీటర్ పరీక్షను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ గ్లూకోజ్ మీటర్లను సులభంగా వినియోగించుకోవచ్చని, రిమోట్ క్లినికల్ సేవలతో అనుసంధానించవచ్చని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పలువురు రోగుల శాంపిల్స్‌పై గ్లూకోజ్ మీటర్లతో విశ్లేషణ చేసిన తర్వాత పరిశోధకులు ఈ టెస్టును ధ్రువీకరించారు.