గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 10, 2020 , 12:42:58

కరోనా కారణంగా ఇప్పటి వరకు 4,011 మంది మృతి

కరోనా కారణంగా ఇప్పటి వరకు  4,011 మంది మృతి

బీజింగ్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) చైనాలో తగ్గుముఖం పడుతుండగా.. మిగతా దేశాల్లో మాత్రం విజృంభిస్తోంది.  ప్రపంచం మొత్తం మీద 100కు పైగా దేశాలకు విస్తరించిన కరోనా కారణంగా మంగళవారం వరకు 4,011  మంది మరణించారు. ఇరాన్‌లో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 7161కి చేరుకుంది. వ్యాధి కారణంగా సోమవారం 43 మంది మరణించగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 237గా నమోదైంది. 

తాజా గణాంకాల ప్రకారం 1,10,000 మందికి పైగా ప్రజలకు వైరస్‌ సోకింది.  వ్యాధి కారణంగా కొత్తగా 17 మంది ప్రాణాలు కోల్పోయారని చైనా తెలిపింది. చైనాలో కరోనా బాధితుల మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి.  చైనాలోనే వైరస్‌ బాధితుల సంఖ్య  80,754కు చేరగా .. 3,136 మరణించారు.  ఇటలీలో పరిస్థితి రోజురోజుకీ చాలా దారుణంగా తయారవుతోంది. ఒక్క రోజులోనే 133 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య  463కు చేరింది. 


logo