గురువారం 04 జూన్ 2020
International - Mar 31, 2020 , 18:14:57

8 లక్షలు దాటిన కరోనా కేసులు..మృతుల సంఖ్య 39వేల పైనే

8 లక్షలు దాటిన కరోనా కేసులు..మృతుల సంఖ్య 39వేల పైనే

న్యూఢిల్లీ:  ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ధాటికి పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కరోనా 201 దేశాల్లో అడుగుపెట్టగా.. ఇప్పటి వరకు కోవిడ్‌-19 బారిన పడిన వారి సంఖ్య 8లక్షలు దాటింది.   స్పెయిన్‌, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతోంది.  వైరస్‌ వేగంగా విజృంభిస్తుండటంతో  అమెరికాలో 3వేలకు పైగా మరణించగా.. స్పెయిన్‌లో 8వేలకు పైగా చనిపోయారు. గడచిని 24 గంటల్లో ఒక్క స్పెయిన్‌లోనే 800కేసులు నమోదయ్యాయి. వైరస్‌ విస్తరిస్తున్న దేశాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో కరోనా బాధితుల సంఖ్య 8లక్షలకు చేరింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 39వేల మంది మృత్యువాత పడ్డారు. 

బెల్జియంలో ఇప్పటివరకు   మొత్తం 705 మంది చనిపోయారు. అందులో 12ఏండ్ల బాలిక కూడా ఉంది.  స్పెయిన్‌లో 24 గంటల్లో 9,222 కొత్త కేసులు నమోదు కాగా 849 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు ఆదేశంలో  బాధితుల సంఖ్య 94,417కు చేరగా.. మొత్తం 8,189 మంది మరణించారు.  ఇరాన్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,606, మృతుల సంఖ్య 2,898కు చేరింది. logo