శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 10, 2020 , 13:41:53

100,000కు చేరువలో కరోనా మరణాలు..!

100,000కు   చేరువలో కరోనా మరణాలు..!

లండన్‌‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడిన బాధితుల సంఖ్య 15లక్షలు దాటగా..మృతుల సంఖ్య 9వేలు దాటి లక్షకు చేరువవుతోంది. గత వారం రోజుల్లోనే కొత్తగా 5 లక్షల మందికి కోవిడ్‌-19 సోకింది.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 95,700వేల మందికి పైగా చనిపోయారని..మరణాల రేటు ఇదే స్థాయిలో కొనసాగితే వీకెండ్‌లోగా మృతుల సంఖ్య లక్ష మార్క్‌ దాటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  కరోనా దెబ్బకు అత్యధికంగా ఇటలీలో   18,279 మంది మృత్యువాత పడ్డారు.  

అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. గత 24 గంటల్లోనే 1,783 మంచి చనిపోయారంటే ఆక్కడ వైరస్‌ ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వైరస్‌ సోకి 16వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో  456,828 కరోనా కేసులు నమోదు కాగా 25,410 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఒక్క న్యూయార్క్‌లోనే 5,150 మంది మరణించారు.  మరోవైపు చైనాలో  కొత్తగా కరోనా కేసులు పెద్దగా నమోదు కావడం లేదు. ఇప్పటి వరకు ఆదేశంలో 81,907 కోవిడ్‌-19 కేసులు నమోదు కాగా..3,336 మంది చనిపోయారు.

మృతుల సంఖ్య ఎక్కువగా నమోదైన దేశాలు..!

ఇటలీ(18,279) 

అమెరికా(16,684)

స్పెయిన్‌(15,447)

ఫ్రాన్స్‌(12,228)

యూకే(7,993)


logo