శనివారం 06 జూన్ 2020
International - May 09, 2020 , 14:16:22

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 2.75 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 2.75 లక్షలు

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.  రష్యా, బ్రెజిల్‌లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడ్డవారి సంఖ్య 40లక్షలకు చేరువైంది. మృతుల సంఖ్య 2.70 లక్షలు దాటిపోయింది. 210కి పైగా దేశాల్లో కరోనా బాధితులు ఉన్నారు. 

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా గణాంకాల ప్రకారం శనివారం మధ్యాహ్నం వరకు 2,74,950 మంది కోవిడ్‌-19 వల్ల చనిపోయారు. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 77,180 మంది మృత్యువాత పడ్డారు. న్యూయార్క్‌లో ఎక్కువమంది బలయ్యారు. 

కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న దేశాలు ఇవే.

అమెరికా(77,180)

బ్రిటన్‌(31,316)

ఇటలీ(30,201)

స్పెయిన్‌(26,299)

ఫ్రాన్స్‌(26,233)

బ్రెజిల్‌(10,017)

బెల్జియం(8,521 )


logo