ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 22, 2020 , 12:24:24

కోటిన్నర దాటిన కరోనా కేసులు

కోటిన్నర దాటిన  కరోనా కేసులు

లండన్‌:  అంతర్జాతీయంగా కరోనా మహమ్మారి  ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య     కోటి 50లక్షలు దాటింది. అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్‌, భారత్‌  దేశాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నది.  ఈ మూడు దేశాల్లో   కరోనా ఉధృతి ఇప్పట్లో  తగ్గుముఖం పట్టేలా లేదు.

బుధవారం మధ్యాహ్నం వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1,50,99,660కుపెరిగింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 6,19,609కు చేరింది. అమెరికా(40,28,569 కేసులు), బ్రెజిల్‌(21,66,532), భారత్‌(11,94,888), రష్యా(7,83,328) దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నది.  

ఒక్క అమెరికాలోనే  1,44,953 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో 81,597 మంది, ఇండియాలో 28,771, మెక్సికోలో  40,400 మంది వైరస్‌ కారణంగా చనిపోయారు.


logo