సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 11:51:51

20 మిలియన్లకు చేరిన కరోనా కేసులు

20 మిలియన్లకు చేరిన కరోనా కేసులు

రష్యా : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మరణాల సంఖ్యా అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 20 మిలియన్ల మంది కరోనా బారినపడగా 12.2 మిలియన్ల మందికిపైగా చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారని, 7.3 మిలియన్ల మంది మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస్‌ ఉద్ధృతికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 5 మిలియన్ల మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. ఆ తరువాతి స్థానం బ్రెజిల్‌ ఆక్రమించింది. బ్రెజిల్‌లో 3 మిలియన్లకు పైగా కరోనా కేసులున్నాయి. 


logo