మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 19, 2020 , 15:33:09

ప్రపంచవ్యాప్త కరోనా కేసులు 2.2 కోట్లు

ప్రపంచవ్యాప్త కరోనా కేసులు 2.2 కోట్లు

న్యూఢిల్లీ:   ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది.   ప్రపంచంలో  కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 2.2 కోట్లను దాటిపోయింది.   ఇతర దేశాల కంటే గత కొద్ది రోజులుగా భారత్‌లో  రికార్డు స్థాయిలో కరోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధవారానికి కరోనా కేసుల సంఖ్య 22,046,135కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ఇప్పటి వరకు 7,78,557 మంది చనిపోయారు. వైర‌స్‌ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య     సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది.  ప్రపంచంలో కరోనా కేసులలో  అగ్రరాజ్యం అమెరికా ముందంజలో ఉన్నది. 

అమెరికా(5,656,204), బ్రెజిల్‌(3,411,872), భారత్‌(2,768,670), రష్యా(937,321) దేశాల్లో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి.  అమెరికాలో వైరస్ కారణంగా ఇప్పటివరకు 1,75,092 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌(1,10,019),మెక్సికో(57,774), భారత్‌(53,026) దేశాల్లో అధికంగా కరోనా మరణాలు సంభవించాయి. 


logo